రాజీమార్గమే రాజ మార్గమని, కేసులో రాజీ పడటం వల్ల ఇరువర్గాలు ఆ కేసులో గెలిచినట్లే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర ప్రారంభించారు. సత్వర న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. లోక్ అదాలత్ డబ్బు సమయం వృధా కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.