ఎల్లారెడ్డి-నాగిరెడ్డిపేట్ మండలాల రైతులకు వరప్రదాయనిగా నిలుస్తున్న నిజాం కాలం నాటి పోచారం ప్రాజెక్టు జలాశయంలోకి శనివారం 4,734 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. వచ్చిన వరద ప్రాజెక్టు కట్టపై నుండి మంజీర నది ద్వారా నిజాంసాగర్లోకి వెళ్తుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది ప్రాజెక్టు ద్వారా 22.103 టీఎంసీల వరద మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు సాగునీటి సమస్య లేకుండా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.