సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు మంగళవారం మధ్యాహ్నం చేగుంట మండలం అనంతసాగర్ ఇబ్రహీంపూర్ రోడ్డు పరిశీలించారు జిల్లాలో అపార నష్టం జరిగినందున క్షేత్రస్థాయిలో అధికారులు నష్టం అంచనాలు జరుగుతున్నాయన్నారు శంకరంపేట రామయంపేట చేగుంట పెద్ద మండలాల పెద్ద ఎత్తున నష్టం వల్ల గజ్వేల్ రోడ్లు కోతలకుగురైయని తెలిపారు. వాగులు వంతెనలు వరద ఉధృత స్థాయిలో ప్రవహిస్తాయని దాటే ప్రయత్నం చేయకూడదు అన్నారు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశంఉనందిన ప్రజలందరూ వ్యక్తిగత శాలరీక పరిసరాలపరిశుభ్రత చేయాలన్నారు.