ఎడపల్లి మండలంలో శుక్రవారం ఎడ్ల పొలాల అమావాస్య పండుగను రైతన్నలు ఘనంగా జరుపుకున్నారు. ఆనవయితిగా వస్తున్న ఈ పండగను రైతులు బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని పెద్ద హనుమాన్ మందిరం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన అనంతరం తమ ఇండ్లలోకి బసవన్నాలను తీసుకెళ్తారు. పోలాల అమావాస్య పర్వదిన సందర్భంలో బసవన్నలను రైతులు గతంలో రంగులతో అలంకరించి భాజ భజంత్రీల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తుండేవారు. నేటి యుగంలో బసవనాలకు బదులుగా ట్రాక్టర్లు వ్యవసాయ పనులలో ఒక భాగంగా గుర్తించిన రైతన్నలు బసవన్నలకు బదులుగా యాంత్రికరణలకు పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు