నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం పరిశీలించారు. నగరంలోని ఆర్య నగర్, మాధవ్ నగర్, బోర్గాం ప్రాంతంలో గల వాగులు, చెరువులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కట్టుదిడ్డమైన ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గుంతల రోడ్లు, వర్షానికి కొట్టుకుపోయిన రోడ్ల మరమ్మతులు చేయాలన్నారు.