కాకినాడ జిల్లా సామర్లకోట లో పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఉదయం నుండి పలు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు, 15వ ఆర్థిక సంఘం మరియు బిపిఎస్ నిధులు నిధులు సుమారు 30 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, అనంతరం ఇటీవల నిర్మించిన మఠం సెంటర్ నుండి నిమ్మ తోట వరకు నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డు ను, సామర్లకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్మించిన సిమెంటు రోడ్డును, లారీ స్టాండ్ వద్ద నిర్మించిన సిమెంటు రోడ్డు ను, గాంధీనగర్ ప్రాంతంలో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు.