ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు పర్యటన వల్ల బాపట్ల ఆర్టీసీ బస్టాండులో ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైంది.దాతలు ఇచ్చిన మినరల్ వాటర్ కూలర్ మరమ్మతులకు గురవగా అధికారులు పట్టించుకోలేదు.ఎండి తన పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించి తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.దీంతో 24 గంటల్లోపే శనివారం సాయంత్రానికల్లా ఆ కూలర్ ను అధికారులు బాగు చేయించారు.దీంతో ప్రజలకు మినరల్ వాటర్ సౌకర్యం మళ్లీ సమకూరింది.