వర్షాలకు నష్టపోయిన చేనేతలను ఆదుకోవాలి: రేణుక భారీ వర్షాలకు నష్టపోయిన చేనేతలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మిగనూరులో వర్షాలకు మగ్గాలు తడిచిపోయి నష్టపోయిన చేనేతలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు మగ్గాల గుంతలలోకి నీళ్లు చేరి తమకు నష్టం జరిగినా ఒక్కరూ పలకరించలేదని చేనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చేనేతలను ఆదుకోవాలని బుట్టా కోరారు.