అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ లోని రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో అంతర్రాష్ట్ర ఫుట్ బాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గౌతమీపురి ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ, రైల్వే ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేమ్, సూరి మెమోరియల్ టోర్నమెంట్ ను గుత్తి డీజల్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ సీనియర్ డీఎంఈ రమేష్, కమిషనర్ జబ్బార్ మియా, ఎస్ఐ సురేష్, టీడీపీ నాయకులు రాజా, రమేష్ లు గురువారం టాస్ వేసి ప్రారంభించారు. మొదటి మ్యాచ్ గుత్తి అర్ఎస్, గుత్తి టౌన్ జట్ల మధ్య జరిగింది.