ఏలూరు జిల్లా ఏలూరు సత్రంపాడు లో శుక్రవారం ఉదయం సుమారు 10:30 సమయంలో విద్యార్థులు రెండు గ్రూపులుగా ఒకరిపై ఒకరు గొడవలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో త్రీ టౌన్ పోలీసులు డ్రోన్ కెమెరాతో వారిని గుర్తించి ఇరువర్గాల విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఎలాంటివి మరోసారి పునరావృతం అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ కోటేశ్వరరావు హెచ్చరించారు