విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలనే తపనతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం గణపురం మండలం, గాంధీ నగర్ లోని మహాత్మా జ్యోతి బా పూలే బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాలపై అవగాహన, సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నిర్వహణను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 10 వ తరగతి విద్యార్థులతో మమేకమై ఎలా ఉన్నారు, బాగా చదువుతున్నారా, ఉదయం ఏమి తిన్నారు, ఆహారం బావుంటుందా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆటలు ఆడుతున్నారా అంటూ ఆరా తీశారు.