విశాఖ: 'టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలని టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో సీతమ్మధార అల్లూరి విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన శుక్రవారం చేపట్టారు. మౌలిక వసతులు లేకపోవడం, బ్యాంకుల ఒత్తిడి, అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లబ్ధిదారులను కలసి అసెంబ్లీలో సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని హామీ ఇచ్చినట్లు సిపిఐ నాయకులు తెలిపారు. కార్యక్రమం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు G05:01 pm. 12th Bleu