రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు తాడిమర్రి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు షర్మిల, శరణ్య, వర్షిత ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయురాలు అరుణ పిఈటి ప్రతాప్ రెడ్డి తెలిపారు. గత నెల 31న అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 13 14 తేదీల్లో కోనసీమ జిల్లా మండపేటలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.