కనిగిరి: టీడీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఒంగోలులో ఆదివారం జరిగిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపి అభివృద్ధి పై నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నారు. ఏ ఎన్నికలు జరిగినా జిల్లాలో టీడీపీ విజయం సాధించేలా అందరం కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు.