భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా వరద బాధిత ప్రాంతాలను హెలికాప్టర్లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మెదక్లో ఏర్పాటు చేసిన వరద ముప్పు ప్రాంతాల ఫోటో గ్యాలరీలను పరిశీలించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రోహిత్ ఆఫీసర్లు పాల్గొన్నారు.