ఎమ్మిగనూరు: కారు, బైకు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ సమీపంలో కారు, బైకు ఢీకొని గురువారం ఇద్దరు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. కోటేకల్ గ్రామానికి చెందిన అశోక్, లేపాక్షి ఆదోని వైపు వెళ్తూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఎమ్మిగనూరు నుంచి వస్తున్న కర్ణాటకకు చెందిన కారు బైకును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుల తలకు, కాలికి తీవ్ర గాయాలవ్వడంతో వారిని ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు.