కాకినాడ జిల్లా,పెద్దాపురం-సామర్లకోట ప్రధాన రహదారి పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల,ఎదురుగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. సామర్లకోట నుంచి పెద్దాపురం వస్తున్న ద్విచక్ర వాహనం, రామారావుపేట నుంచి సామర్లకోట వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనటంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపతికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*