నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో డిఆర్ కాలువ పనుల్లో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కోటి యాభై లక్షల రూపాయలు కమీషన్ కాంట్రాక్టర్ నుంచి డిమాండ్ చేశాడని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి బాంబ్ పేల్చారు. దగదర్తి లో డిఆర్ కాలువ పనులు నాసిరకంగా జరిగాయని మాలేపాటి సుబ్బానాయుడు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రవికుమార్ చౌదరి రైతులతో కలిసి కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మా