శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన జరిగిన వినాయకుని ఊరేగింపు కార్యక్రమం కొట్లాటకు దారితీసింది. స్థానిక చాకలి వీధిలో వద్ద గణనాథుడిని ఎక్కువ సమయం ఉంచలేదని స్థానిక యువకులు గణపతి పూజ కమిటీ సభ్యులపై ప్రశ్నించడంతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ కోట్లాటలో ఎనిమిది మంది వ్యక్తులకు గాయాలు కాగా.. ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలైనట్టు గ్రామస్తులు గురువారం ఉదయం తెలిపారు.