పెద్దాపురం పురపాలక సంఘం పరిధిలో వాట్సప్ గవర్నర్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల వరకు, పెద్దాపురంలో సచివాలయాల పరిధిలో ప్రతినెల రెండు రోజులపాటు వాట్స్అప్ గవర్నర్స్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలు వారికి అవసరమైన పౌర సేవలను ఉచితంగా దీని ద్వారా పొందవచ్చు అన్నారు. అలాగే ప్రజా సమస్యలపై ఫిర్యాదు కూడా చేయవచ్చాన్నారు. ఈ సందర్భంగా పాత పెద్దాపురంలోని పలు సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించారు.