ప్రధానమంత్రి మోడీ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షుడు భైరి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఓట్ చౌరీ అంటూ,రకరకాల మాటలతో వ్యక్తిగతంగా దూషించడం సమంజసం కాదన్నారు. లేని పోని అబద్ధాలు మాట్లాడుతూ బీజేపీ ని బదనాం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ చేపడితే బీజేపీ నాయకులు తరిమికొడతా