కడప నగరంలోని 15వ డివిజన్ మరియు నగర సమీపంలోని అలం ఖాన్ పల్లెలో డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కడపకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన కాలువలు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తు మురుగు ప్రవాహానికి ఆటంకంగా మారాయి. మురుగు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉండటంవల్ల దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. నగరపాలక పారిశుద్ధ్య కార్మికులు అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేయాలన్నారు.