Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలో ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్, 9910/- నగదు స్వాధీనం

Nizamabad South, Nizamabad | Sep 9, 2025
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు నాల్గో టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. టౌన్ పరిధిలోని జెండా గల్లీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.9,910 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us