కామారెడ్డి : విద్యా రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని కామారెడ్డి జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజు విమర్శించారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా రంగంలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యారంగానికి ఎటువంటి న్యాయం జరగలేదన్నారు.