బీఈడీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలకు సమయానుకూలంగా మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికరమైన ఆహారం అందించి వారి విద్యకు భంగం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ బిఈడి కళాశాల విద్యార్థినిలకు తెలిపారు.ఆదివారం నాడు భద్రాచలం పట్టణంలోని బీఈడీ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినిలకు తయారు చేస్తున్న వంటకాలను, చికెన్, కూరగాయలు వండిన ఆహారాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థినిలకు భోజనం అందిస్తున్నది లేనిది మరియు కళాశాలలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు