వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన సాత్విక్ అనే 13 సంవత్సరాల బాలుడు గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ కి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై ఘోరానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాలుడి మృతితో అన్నారం గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. సంఘటన స్థలానికి చేరుకొని పర్వతగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.