అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని బెలుగుప్ప ఉరవకొండ కూడేరు విడపనకల్లు వజ్రకరూర్ మండలాల్లో ని పలు గ్రామాల్లో ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉరవకొండ లోని కాణిపాక వరసిద్ధి వినాయక సేవా సమితి 25వ వార్షికోత్సవంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో ఉరవకొండ గోల్డ్ షాప్ బబ్లు 70 వేల రూపాయలకు వేలంపాట దక్కించుకున్నారు. బెలుగుప్ప తాండ గ్రామంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎన్. బీమా నాయక్ 10000 రూపాయలకు లడ్డు వేలం దక్కించుకున్నారు.