రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సు మరియు బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌదరి పల్లి గ్రామానికి చెందిన కూరాకుల మల్లేష్ (36) ఆమనగలనుండి స్వగ్రామానికి వెళ్తుండగా ద్విచక్ర వాహనానికి ఎదురుగా వచ్చిన మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.