సదాశివనగర్ మండలంలోని పీహెచ్సీలో బుధవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి ఆస్మా పేర్కొన్నారు. 'స్వస్త్ నారీ, సశక్త్ పరివార్' కార్యక్రమంలో భాగంగా ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాకేష్ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ తీసుకోవాలని సూచించారు. అత్యవసరం అయితే పల్లె దవాఖానాలను సంప్రదించి అక్కడ వైద్య బృందంచే మందులు మరియు సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.