ప్రముఖ భావపురి బాపట్ల సూర్యలంక బీచు గోవా బీచ్గా మార్చేస్తున్నారనే వార్తలను శివస్వామి ఖండించారు. సోమవారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బాపట్ల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవా బీచ్ అంటేనే అశ్లీలతకు మారుపేరని పేర్కొన్నారు. బాపట్ల సూర్యలంక బీచ్ వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని శివస్వామి తెలిపారు.