నూజివీడు పట్టణంలోనే మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ టిడిపి ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ లు మాట్లాడుతూ వర్షాలు పడితే నూజివీడు పట్టణం లో రోడ్లపై మోకాటిలోతు నీళ్ళు నిలుస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా ఎన్టీఆర్ కాలనీ, డాక్టర్ ఎంఆర్ అప్పారావు కాలనీ, హనుమాన్ జంక్షన్ రోడ్డు, మొగళ్ళ చెరువు, యానాదుల కాలనీ ప్రాంతాలలో డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి వర్షపు నీరు చేరుతోందన్