సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలి బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆదివారం చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతుందని, గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని తిరిగి భక్తుల దర్శనార్థం తెరవనున్నట్లు Way 2 News కు పూజారి సంతోష్ తెలిపారు.