జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ వారి సూచనలు మేరకు కడప నగరం దండు గిరిజనుల కాలనీ నందు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులచే న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్సా పథకం 2015, నల్సా (సంవాద్ - అట్టడుగు బలహీన ఆదివాసులు మరియు డినోటిఫైడ్ / సంచార తెగలకు న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేయడం,) పథకం 2025, నల్సా (ఆశ అవగాహన మద్దతు సహాయం మరియు చర్య) బాల్యవివాహాలను నిర్మూలించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం 2025, గిరిజన ప్రజలలో బాల్య వివాహాలు - చిన్న వయసులోనే గర్భధారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు