అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ ఏమి జరుగుతుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్కెస్ట్రా, విగ్రహాల ఊరేగింపు విషయంలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ. ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకుడు కాకర్ల రంగనాథ్ వర్గీయులు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పట్టణంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆర్టీసీ బస్సులకు పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారు. వెయ్యి మంది పోలీసులతో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పట్టణం గుప్పిట్లోకి తీసుకున్నారు.