మంచిర్యాల జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేటు పాఠశాలల పై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి కి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. లక్షెట్టి పేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తనిఖీకి వచ్చిన సందర్భంగా ఈ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలలో ఫీజులు అధికంగా వసూలు చేయడమే కాకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు.