ఎల్లారెడ్డి: ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎల్లారెడ్డి మండలంలోని జాన్కంపల్లి (కుర్దు) గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు ముప్పడి రోజాకు ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ పూర్తి కావడంతో ప్రభుత్వం వారి ఖాతాలో రూ.1,00,000 (లక్ష రూపాయలు ) జమ చేసిన సందర్భంగా లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ నాయక్ మాట్లాడుతూ మా స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలపాటు పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేని అసమర్ధ పాలనగా చరిత్రలో మిగిలి పోయిందన్నారు.