వెలిగండ్ల: మ్యాజిక్ డ్రైనేజీ కాలువల నిర్మాణంతో ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. వెలిగండ్ల మండలం చోడవరం గ్రామంలో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మ్యాజిక్ డ్రైనేజీ కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించింది. సోమవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మ్యాజిక్ డ్రైనేజీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... మ్యాజిక్ డ్రైనేజీ కాలువల నిర్మాణం వల్ల ఇళ్లలోని వర్షపు నీరు, మురుగునీరు కాలువల్లోనే ఇంకే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీంతో ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.