అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో తరచూ వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు గ్రామాల్లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి దోమల నివారణకు సాగిన కార్యక్రమాలను చేపట్టడం చేయాలని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్జెక్ట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి గురువారం సూచించారు. మండల కేంద్రంలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల చేత దోమల నివారణకు ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులకు ప్రధాన కారణమైన దోమలను నివారణ మనందరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.