అధిక వడ్డీలు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పాన్ బ్రోకర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. రామాయంపేట పోలీస్ స్టేషన్ ను మంగళవారం రాత్రి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో నమోదవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. కేసుల విచారణ వేగవంతంగా చేయాలని సూచించారు. చోరీలు అరికట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.