గత రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేక నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో మంగళవారం జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంగి గ్రామ మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్ తో పాటు పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నిండు మనసుతో బీజేపీ పార్టీని ఆదరించిన ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను గె