ఆగస్టు 25 26 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో, అఖిల భారత ఐక్య రైతు సంఘం(AIUKS) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని AIUKS రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న, పార్వతి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ నసీర్, వడ్డెన్న పిలుపునిచ్చారు. రెంజల్ మండల్ బోర్గం గ్రామంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి, సన్న వడ్లకు 500 బోనస్ అమలు చేయాలని, వానకాలం ఖరీఫ్ కు రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు పురుగు మందులు సబ్సిడీతో విరివిగా అందించాలని డిమాండ్ చేశారు.