రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామ పరిధిలోని కుమ్మరి మిట్టలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి, అనంతరం ఆర్డీవో శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి. మహేష్, రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగల శ్రీనివాసులు మాట్లాడుతూ...కుమ్మరి మిట్టలో దాదాపు 450 కుటుంబాలు నివసిస్తున్నాయి. కానీ గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు నాయకులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.