గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడులో ఎన్టీ రామారావు విగ్రహాన్ని శ్రీకృష్ణుడు రూపంలో పెట్టడం దారుణమని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. మంగళగిరిలో సోమవారం బీసీవై పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం ప్రకారం దేవుళ్ల విగ్రహాలను అవమానిస్తే ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బెదిరించినా తాను ఎవరికీ భయపడనని ఆయన స్పష్టం చేశారు.