పలమనేరు: ఆర్డిఓ కార్యాలయం వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది కూటమి ప్రభుత్వం కాదని, రైతు దగా ప్రభుత్వమని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏనాడు రైతులకు మేలు చేయలేదన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు ఏమి మేలు చేస్తాడని పలు విమర్శలు గుప్పించారు. వైసిపి హయాంలో కరోనా టైంలో కూడా రైతు భరోసా కేంద్రాలలో రైతులకు యూరియా సకాలంలో అందించామన్నారు.