శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం డిఎస్పి కార్యాలయంలో సెప్టెంబర్ 4వ తేదీ నిర్వహించే వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని హిందూపురంలో ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నట్లు పాటించవలసిన నియమ నిబంధనల గురించి డిఎస్పి మహేష్ తెలియజేశారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఉదయం 10 నుంచి 11 గంటలలోపు గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని నిమజ్జనం రోజు ఉదయం 10 నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ఉన్న ఆటోనగర్, చోళ సముద్రం క్రాస్, సేవ మందిర్ వద్ద ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ రాకూడదని రహమత్ పురం, కంచి కామాక్షి కళ్యాణమండపం వద్ద కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసినట్లు తెలిపారు.