ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఆదివారం వివిధ పార్టీల నాయకులు, అధికారులతో చేవెళ్ల పార్లమెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వాసుచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, ఛైర్మన్ అశోక్, ఎమ్మార్వో ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.