యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.వరి పంట నాట్లు సమయానికి రైతులందరికీ ప్రభుత్వం యూరియా అందుబాటులోకి తెస్తుందని ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగనియదని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు అవసరమైన యూరియా అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.