కాగజ్ నగర్ లోని వినాయకులను నిమజ్జనం కోసం తీసుకొచ్చే భక్తులకు, వినాయక శోభయాత్ర వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. నిమజ్జన ప్రదేశం పెద్దవాగును కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలసి పరిశీలించారు. వాహనాలు తిరిగే విధంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు వారు ఆదేశించారు. నిరంతరం వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేయాలని, వినాయక ప్రతిమల నిమజ్జనాల కోసం క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు.