మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామానికి చెందిన చెంచు గిరిజనుడు నరసింహ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తోటి చెంచులతో కలిసి సమీపంలోని నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న చలమ రేంజ్ లో సున్నం బట్టి ఏరియాలో తేనె కోసం గాలిస్తుండగా ,ముళ్లపదలో దాక్కున్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది.నరసింహ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న చెంచులు ఎలుగుబంటి కేకలు వేయడంతో నరసింహను వదిలి ఎలుగుబంటి సమీపంలోని అడవిలోకి వెళ్లినట్లు వారు తెలియజేశారు.గాయపడిన గిరిజను 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.