కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలంలో కుందూనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రం తెల్సిన వివరాల మేరకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 30 వేల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. మండలం లోని నెమళ్లదిన్నె గ్రామంలోని వంతెనపై నది ప్రవహిస్తుండటంతో సుమారు 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరి, జొన్న, మిరప, కంది పంట పొలాలు నీట మునిగాయి. కుందూ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.